వాయనాడ్‌లోని కేరళ వెటర్నటీ యూనివర్సిటీ ర్యాగింగ్ ఓ విద్యార్థిని పొట్టన పెట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. జేఎస్ సిద్ధార్థ్(20 ) యూనివర్సిటీలో సెకండ్ ఈయర్ చదువుతున్నాడు. ఫిబ్రవరి 18న అతను యూనివర్సటీ హాస్టల్ బాత్ రూంలో ఉరేసుకొని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్యపై కుటుంబ సభ్యలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కేసు పెట్టారు. సిర్థార్ధ్‌పై ఎస్‌ఎఫ్‌ఐ స్టూడెంట్స్ దాడి చేశారని అతని తల్లిదండ్రులు ఆరోపించారు.
అనంతరం కేరళ పోలీసులు కాలేజ్ లో కొంతమంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ చేయించగా.. సీనియర్స్ ర్యాగింగ్ కారణంగానే మనస్థాపానికి గురై సిర్ధార్థ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. సిర్ధార్థ్‌ని ఇనిస్టిట్యూట్‌లోని సీనియర్లు, తోటి విద్యార్థులు ఫిబ్రవరి 16న ఉదయం 9 గంటల నుంచి ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 2 గంటల 29 గంటల పాటు ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలకు గురిచేశారని సీబీఐ వెల్లడించింది. బెల్ట్ తో కొట్టి, క్రూరంగా ప్రవర్తించారని, శారీరక, మానసిక హింసకు గురయ్యాడు. యూనివర్సిటీలో చదువు కొనసాగించలేక, ఇంటికి వెళ్లలేక సిర్ధార్థ్ కాలేజ్ హాస్టల్ లో సూసైడ్ చేసుకున్నాడని సీబీఐ విచారణలో తేలింది. సీబీఐ విచారణ చేపట్టి 20 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.