నాగోబా జాతర భక్తులతో పోటెత్తుతోన్నకేస్లాపూర్‌

నాగోబా జాతర భక్తులతో పోటెత్తుతోన్నకేస్లాపూర్‌

నాగోబా జాతరకు తరలివస్తున్న భక్తజనంతో కేస్లాపూర్‌ పోటెత్తుతోంది. రెండో రోజు ఆదివారం  భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మెస్రం వంశీయులు ఉదయం గోవాడ నుంచి ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడాయి.   పోలీసులు ప్రత్యేక  బందోబస్తు నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపులు, ప్రభుత్వ శాఖల ఆధర్యంలో వివిధ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. సోమవారం పెర్సపేన్,బాన్‌పేన్‌ పూజలు,మంగళవారం మండగాజిలి,బేతాళ్‌ పూజలు ఉంటాయని మెస్రం వంశీయులు తెలిపారు.

- గుడిహత్నూర్ / ఆదిలాబాద్​ ఫొటోగ్రాఫర్ , వెలుగు