అక్బర్​పేటలో బారులు తీరిన మాంసం ప్రియులు

అక్బర్​పేటలో బారులు తీరిన మాంసం ప్రియులు

పోలీస్​బందో బస్తు మధ్య అమ్మకాలు

దుబ్బాక, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మటన్ ధర మండిపోతుంటే​ ఆదివారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్​పేటలో రూ. 400కే అమ్మారు. కేజీ మటన్ ​సగం ధరకే వస్తుండడంతో మండలంలోని ప్రజలే కాకుండా, సరిహద్దు మండలాల ప్రజలు కూడా తరలి వచ్చి మటన్ కొనుగోలు చేశారు. స్థానికంగా ఉండే మటన్ వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడడంతో రెండు నెలలుగా సగం ధరకే అమ్ముతున్నారని వినియోగదారులు చెప్పారు. దుకాణాల ఎదుట వినియోగదారుల రద్ధీ పెరిగి గొడవ జరుగుతుండడంతో  భూంపల్లి పోలీసులు అలర్ట్ ​అయ్యారు. షాపుల ఎదుట క్యూలైన్లలో నిలబెట్టి మటన్​ అమ్మకాలు జరిపించారు.