కేజీబీవీల్లో 1241 కాంట్రాక్ట్ టీచర్స్​

కేజీబీవీల్లో 1241 కాంట్రాక్ట్ టీచర్స్​

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) 1241 మహిళా కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ టీచర్స్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేయచ్చు.

పోస్టులు(కేజీబీవీలు):స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌–38, పీజీసీఆర్‌‌‌‌‌‌‌‌టీ(ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌)–110, పీజీసీఆర్‌‌‌‌‌‌‌‌టీ (గణితం)–60, పీజీసీఆర్‌‌‌‌‌‌‌‌టీ(నర్సింగ్‌‌‌‌‌‌‌‌)–160,పీజీసీఆర్‌‌‌‌‌‌‌‌టీ(తెలుగు)–104, పీజీసీఆర్‌‌‌‌‌‌‌‌టీ(ఉర్దూ)–02, పీజీసీఆర్‌‌‌‌‌‌‌‌టీ(వృక్షశాస్త్రం)–55, పీజీసీఆర్‌‌‌‌‌‌‌‌టీ(కెమిస్ట్రీ)–69, పీజీసీఆర్‌‌‌‌‌‌‌‌టీ(సివిక్స్‌‌‌‌‌‌‌‌)–55, పీజీసీఆర్‌‌‌‌‌‌‌‌టీ(కామర్స్‌‌‌‌‌‌‌‌)–70, పీజీసీఆర్‌‌‌‌‌‌‌‌టీ(ఎకనామిక్స్‌‌‌‌‌‌‌‌)–54, పీజీసీఆర్‌‌‌‌‌‌‌‌టీ(ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌)–56,పీజీసీఆర్‌‌‌‌‌‌‌‌టీ(జంతుశాస్త్రం)–54,పీజీసీఆర్‌‌‌‌‌‌‌‌టీ(బయోసైన్స్‌‌‌‌‌‌‌‌)–25,సీఆర్‌‌‌‌‌‌‌‌టీ(ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌)–52,సీఆర్‌‌‌‌‌‌‌‌టీ(హిందీ)–37,సీఆర్‌‌‌‌‌‌‌‌టీ(గణితం)–45, సీఆర్‌‌‌‌‌‌‌‌టీ(ఫిజికల్‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌)–42, సీఆర్‌‌‌‌‌‌‌‌టీ(సోషల్‌‌‌‌‌‌‌‌ స్టడీస్‌‌‌‌‌‌‌‌)–26, సీఆర్‌‌‌‌‌‌‌‌టీ(తెలుగు)–27, ఫిజికల్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌–77. ఈ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ/బీఈడీ(స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌) /యూజీపీఈడీ/బీపీఎడ్‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణతతోపాటు టెట్‌‌‌‌‌‌‌‌/సీటెట్‌‌‌‌‌‌‌‌లో అర్హత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 44 మధ్య ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​:  సీఆర్‌‌‌‌‌‌‌‌టీ పోస్టులు: రాతపరీక్ష(80 శాతం వెయిటేజీ), టెట్‌‌‌‌‌‌‌‌(20 శాతం వెయిటేజీ)లో పొందిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.        
స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌కు రాతపరీక్ష(75 శాతం వెయిటేజీ), టెట్‌‌‌‌‌‌‌‌(20 శాతం వెయిటేజీ), పని అనుభవం(5 శాతం వెయిటేజీ)లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. పీజీసీఆర్‌‌‌‌‌‌‌‌టీ పోస్టులకు రాతపరీక్ష(95 శాతం వెయిటేజీ), పని అనుభవం(5 శాతం వెయిటేజీ)లో పొందిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. పీఈటీ ఉద్యోగాలకు రాత పరీక్ష(100 శాతం వెయిటేజీ)లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.   

దరఖాస్తులు: ఆన్​లైన్​లో జులై 5 వరకు అప్లై చేసుకోవవచ్చు. వివరాలకు www.schooledu.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.