కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని భాగ్యనగర్ తండా విద్యుత్ సబ్‌స్టేషన్‌కు స్థలదాత లక్ష్మి ఆదివారం తాళం వేసి నిరసన తెలిపారు. సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం దానంగా ఇచ్చిన సమయంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, ఏండ్లు గడిచినా ఆ మాట నిలబెట్టుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని లక్ష్మితో మాట్లాడారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళనను విరమించారు.
