‘డీఐసీఎస్​సీ’లో పైలెట్​ప్రాజెక్ట్ గా ఖమ్మం జిల్లా

‘డీఐసీఎస్​సీ’లో పైలెట్​ప్రాజెక్ట్ గా ఖమ్మం జిల్లా

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : దేశవ్యాప్తంగా 10 జిల్లాల్లో ప్రారంభమైన డిజిటల్​ఇండియా కామన్​ సర్వీస్​ సెంటర్​ ప్రాజెక్ట్​లో ఖమ్మం జిల్లా పైలెట్​ప్రాజెక్ట్​గా ఎంపికైంది. ఈ ప్రాజెక్టు ద్వారా 137 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఎంపికయ్యారని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్​కు వచ్చిన మహిళలో ఆయన మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సెర్ఫ్, సీఎస్​సీ కలిసి జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు మోడల్​ సీఎస్​సీ కేంద్రాలు స్థాపించేందుకు అవకాశం కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు. 

ఈ కేంద్రాలు రాజీవ్ యువ వికాసం, డీఐసీఎస్​సీ ద్వారా మంజూరవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఐసీఎస్​సీ రాష్ట్ర ఇన్​చార్జి హరికృష్ణ కుమార్, సీఎస్​సీ జిల్లా కో-ఆర్డినేటర్ ఫయాజ్, జిల్లా మేనేజర్ సురేశ్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో వ్యాపార శిక్షణ పొందిన 70 మంది మహిళలు ఉన్నారు.