గ్రామీణ అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ రఘురాంరెడ్డి

గ్రామీణ అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం :  ఎంపీ రఘురాంరెడ్డి
  • ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి 

పెనుబల్లి, వెలుగు :  గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్​ ప్రభుత్వం పనిచేస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామంలో రూ.9 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రూరల్​ ఏరియాలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్​ నాయకుడు మట్టా దయానంద్​, తహసీల్దార్​ గంటా ప్రతాప్, ఎంపీడీఓ అన్నపూర్ణ పాల్గొన్నారు. ​

పలువురికి ఎంపీ పరామర్శ..

తల్లాడ  : మండలంలోని అన్నారుగూడెంకు  చెందిన బయ్యవరపు దర్గయ్య ఇటీవల మృతిచెందగా ఆయన ఫొటోకు పూలమాల వేసి ఎంపీ రఘురాంరెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామచంద్రపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పులి కృష్ణార్జున రావు తండ్రి కనకదుర్గయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఉన్నారు.