
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఖమ్మం నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా, నాణ్యమైన ప్రమాణాలను పాటిస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను స్పీడప్ చేసి త్వరగా కంప్లీట్ చేయాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని వివిధ వార్డుల్లో నిర్మాణంలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో నీటి నిల్వ, కాలువలలో జమయ్యే చెత్త లాంటి సమస్యల నివారణకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కీలకమైందని తెలిపారు. అభివృద్ధి పనుల్లో పారదర్శకత, వేగం, నాణ్యత ఉండాలన్నారు. అవసరమైతే మానిటరింగ్ మెకానిజాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.