క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌కు ఖమ్మం టికెట్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌ !

క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌కు ఖమ్మం టికెట్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌ !
  • పోటీలో రాయల, మండవ, వీవీసీ రాజేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌

ఖమ్మం, వెలుగు : ఖమ్మం పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌ఫైట్‌‌‌‌‌‌‌‌ క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌కు చేరినట్లు తెలుస్తోంది. నెల రోజులకు పైగా సాగుతున్న సస్పెన్స్‌‌‌‌‌‌‌‌కు ఒకటి రెండు రోజుల్లో ఎండ్‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌ పడనుంది. జిల్లాకు చెందిన సీనియర్‌‌‌‌‌‌‌‌ నేత రాయల నాగేశ్వరరావుకు టికెట్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ అయినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుండగా, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు పేరు సైతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సర్కిల్స్‌‌‌‌‌‌‌‌లో వినిపిస్తోంది. అయితే వ్యాపారవేత్త వీవీసీ రాజేంద్రప్రసాద్ కూడా ఇంకా రేసులోనే ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

పోటీలో ముగ్గురు వ్యక్తులు

ఖమ్మం పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌ను కమ్మ సామాజికవర్గానికి కేటాయించాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లుగా లీడర్లు చెబుతున్నారు. ఈ టికెట్‌‌‌‌‌‌‌‌ కోసం ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు పోటీ పడుతున్నారు. వ్యాపారవేత్త వీవీసీ రాజేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌ ఎలాగైనా టికెట్‌‌‌‌‌‌‌‌ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి సన్నిహితుడిగా రాజేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌కు పేరుంది. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మాత్రం ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు వారం రోజుల నుంచి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది.

గతంలో టీడీపీలో పనిచేసిన టైంలో ఉన్న పరిచయాలతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డే మండవను రేసులోకి తెచ్చినట్లు చర్చ జరుగుతోంది. మండవకు, తుమ్మలకు గతంలో చంద్రబాబు కేబినెట్‌‌‌‌‌‌‌‌లో కలిసి పనిచేసిన సాన్నిహిత్యం కూడా ఉంది. ఖమ్మం పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ స్థానం నుంచి కాంగ్రెస్​తరఫున చాలా మంది స్థానికేతరులు ఎంపీలుగా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉంది. మొత్తం 17 సార్లు ఎన్నికలు జరుగగా గెలిచిన వారిలో ఇద్దరు మాత్రమే ఖమ్మం జిల్లాకు చెందినవారు. అయితే ఇప్పుడు స్థానికేతరుడిని అభ్యర్థిగా తీసుకువస్తే సహకరించేది లేదని ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు, ఓ మంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం.

రాయల వైపు మంత్రుల మొగ్గు ?

పార్టీకి లాయల్‌‌‌‌‌‌‌‌గా పనిచేయడం, వివాదరహితుడిగా పేరు ఉండడంతో పాటు స్థానిక అంశాల దృష్ట్యా రాయల నాగేశ్వరరావుకు టికెట్‌‌‌‌‌‌‌‌ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు కావడంతో పాటు లోకల్‌‌‌‌‌‌‌‌ వ్యక్తి కావడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం వంటి అంశాలు ఆయనకు సానుకూలంగా ఉన్నాయి. 2021లో ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు గెలిచే బలం లేనప్పటికీ బరిలో నిలిచి భారీగానే ఖర్చుపెట్టారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరడంతో ఆయనకు టికెట్‌‌‌‌‌‌‌‌ దక్కలేదు. ఎన్నికలకు ముందే రాయల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లిన పొంగులేటి భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో మంచి పదవి వచ్చేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. భట్టి కూడా సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తుండగా, తుమ్మల కూడా రాయల నాగేశ్వరరావు పట్ల అభ్యంతరం లేదని చెప్పటినట్లు సమాచారం. దీంతో ఖమ్మం క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ ఎంపిక మరో రెండు రోజుల్లో ఫైనల్‌‌‌‌‌‌‌‌ కానున్నట్లు తెలుస్తోంది.