ఖమ్మం సభ బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయిస్తది : మంత్రి సత్యవతి

ఖమ్మం సభ బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయిస్తది : మంత్రి సత్యవతి

ఖమ్మం బహిరంగ సభ బీఆర్ఎస్ భవిష్యత్ ను నిర్ణయిస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ఈ నెల 18 న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభపై  మాట్లాడిన మంత్రి సత్యవతి... జిల్లా నుండి లక్షా 20 వేల మందిని బహిరంగ సభకు తరలించాలని సూచించారు.  అందరి సహకారంతో  కేసీఆర్ మహబూబాబాద్ పర్యటన  విజయవంతం అయ్యిందని తెలిపారు. ఈ సంవత్సరంలొనే ఎన్నికలు రాబోతున్నాయని, మహబూబాబాద్ ఎడ్యుకేషన్ హబ్ గా మారబోతుందన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయని మంత్రి చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలు తిప్పి కొట్టవలసిన అవసరం ఉందని..  ఖమ్మం సభను విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారు.