ఖర్గే, రాహుల్ బీజేపీతో టచ్ లో ఉన్నారు .. రిపబ్లిక్ టీవీ స్క్రీన్ షాట్ వైరల్

ఖర్గే, రాహుల్ బీజేపీతో టచ్ లో ఉన్నారు .. రిపబ్లిక్ టీవీ స్క్రీన్ షాట్ వైరల్

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ బీజేపీతో టచ్ లో ఉన్నారని రిపబ్లిక్ టీవీ బ్రేకింగ్ న్యూస్ టెంస్క్రీన్ షాట్ షోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందుకే కొన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని ప్రచారం సాగింది. 

గతకొన్ని వారాలుగా కీలకమైన లోక్ సభ ఎన్నికలకు ముందు పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీ వీడారు. మాజీ మంత్రి మిలింద్ దేవరా మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షమైన ఏక్ నాథ్ షఇండే నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆ వెంటనే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.

మాజీ ఎంపీ, సీఎం కమల్ నాథ్ బీజేపీలోకి మారనున్నరనే ఊహాగానాలలు శనివారం నుంచి ఊపందుకున్నాయి. అయితే చాలా మంది బీజేపీ అనుకూల X హ్యాండి ల్స్ ఇంతకుముందు చాలా మంది నాయకు లు పార్టీని విడిచి పెట్టడంపై కాంగ్రెస్ పార్టీనీ దాని కార్యకర్తలను ఆటపట్టించే ప్రయత్నంలో స్క్రాన్ షాట్ లను ట్వీట్ చేశారు. 

ALSO READ | వారణాసిలో రాహుల్ భారత్ న్యాయ్​ యాత్ర..

అయితే రిపబ్లిక్ టీవీ దీనిపై ఆదివారం వివరణ ఇచ్చింది. ఇంతకుముందు రిపబ్లిక్ టెంప్లేట్ ను ఉపయోగించిన స్క్రీన్ షాట్ లు వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే , రాహుల్ గాంధీ బీజేపీతో టచ్ ఉన్నారని ఈ టెంప్లేట్ ద్వారా ప్రచారం జరిగింది... అయితే ఇది మార్ఫింగ్ చేయబడిందని పేర్కొంది. రిపబ్లిక్ బ్రాందడ్ లోగోను ఉపయోగించి ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ కాకుండా చూసేందుకు మేం సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లలో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది.