ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి..డీలిమిటేషన్ పై మోదీకి ఖర్గే లేఖ

ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి..డీలిమిటేషన్ పై మోదీకి ఖర్గే లేఖ

నియోజకవర్గాల పునర్విభజనపై పీఎం మోదీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.   కేంద్రం పార్లమెంట్ స్పెషల్ సెషన్ ఆలోచనలోఉన్నందున  డీలిమిటేషన్ పై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు.  ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు.  అలాగే ఈ ప్రతిపాదనలను పరిశీలించడానికి రాజకీయ పార్టీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత సమయం ఇవ్వాలన్నారు.

మల్లికార్జు ఖర్గే రాసిన లేఖలో  ఏమన్నారంటే...  ఇప్పటికే 2026జూలై 16న డీలిమిటేషన్ పై లేఖ రాశా. వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభనకు  కేంద్రమే కారణం. డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా ఉంది. డీలిమిటేషన్ అనేది దేశానికి అత్యంత ముఖ్యమైన అంశం.2026 ఏప్రిల్ 16, 17 తేదీలలో మీరు ప్రయత్నించినట్లుగా మళ్లీ బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించవద్దు.  విపక్షాల అభ్యంతరాలపై కేంద్రం నిర్లక్ష్యంగా ఉంటోంది. ప్రస్తుత ఎంపీల సంఖ్య 543ని మరో 25 ఏండ్లు కొనసాగించాలి.  లోక్ సభలో రాష్ట్రాల ప్రస్తుత వాటా మరో 25 ఏండ్లు ఉండాలి. 2029లోక్ సభ ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి అని లేఖలో తెలిపారు.