కుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌: పేరు, ఫొటో మార్చేసి..

V6 Velugu Posted on Jul 20, 2021

చెన్నై: యాక్టర్, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌ అయింది. ఆమె అకౌంట్‌ను కంట్రోల్‌లోకి తీసుకున్న హ్యాకర్.. ప్రొఫైల్ నేమ్, కవర్ ఫొటోను మార్చేశాడు. ఒక రాకాసి లాంటి ఫొటోను పెట్టి,  ప్రొఫైల్ నేమ్‌ను బ్రెయిన్ (Briann) అని మార్చాడు. అలాగే కుష్బూ ఇప్పటి వరకూ పోస్ట్ చేసిన ట్వీట్లు అన్నింటినీ డిలీట్ చేశాడు. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని గుర్తించిన కుష్బూ తన అభిమానులు, ఫాలోయర్స్‌ను అలెర్ట్ చేశారు. తన అకౌంట్ హ్యాక్ అవ్వడం లేదా మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి మూడు సార్లు లాగిన్ ట్రై చేసి ఫెయిల్ అవ్వడాన్ని గుర్తించామని ట్విట్టర్ తనకు మెసేజ్ పంపిందంటూ కుష్బూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే రెండ్రోజులుగా తాను ట్విట్టర్ అకౌంట్‌లో లాగిన్ అవ్వలేకపోతున్నానని, పాస్‌వర్డ్‌ మార్చడం కూడా సాధ్యపడడం లేదని తెలిపారు. ట్విట్టర్‌‌ కంపెనీ నుంచి తనకు ఎటువంటి సాయం అందడం లేదని చెప్పారు. తన అకౌంట్‌ను సస్పెండ్ చేసే అవకాశం ఉందని ట్విట్టర్ వాళ్లు చెబుతున్నారని, అసలేం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదని, ఇష్యూను సాల్వ్‌ చేసేందుకు ఎవరైనా సహకరించాలని కుష్బూ కోరారు. కాగా, 2020 ఏప్రిల్‌లోనూ కుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న కుష్బూ మళ్లీ సూపర్‌‌ స్టార్‌‌ రజినీకాంత్ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అన్నాత్తే సినిమాలో రజినీకాంత్ భార్య కారెక్టర్‌‌లో కుష్బూ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Tagged Twitter, Rajinikanth, Khushbu Sundar, Twitter Hacked

Latest Videos

Subscribe Now

More News