బిజిలీ మెరుపులు

బిజిలీ మెరుపులు

ఓ వైపు టాలీవుడ్.. మరోవైపు బాలీవుడ్‌‌ రెండు చోట్లా సినిమాలు చేస్తూ స్టార్‌‌‌‌ హీరోయిన్‌‌ స్టేటస్‌‌ను ఎంజాయ్ చేస్తోంది కియారా అద్వాని. ఈ ఏడాది ఇప్పటికే భూల్ భులయ్యా 2, జగ్ జగ్ జియో చిత్రాలతో హిందీ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె, డిసెంబర్‌‌‌‌లో ‘గోవింద నామ్ మేరా’ చిత్రంతో రాబోతోంది. విక్కీ కౌశల్‌‌కి భార్యగా భూమి ఫెడ్నేకర్‌‌‌‌ నటిస్తుండగా కియారా నాటీ గర్ల్ ఫ్రెండ్‌‌గా కనిపించబోతోంది. శశాంక్‌‌ కైతన్ దర్శకుడు. ఈ కామెడీ థ్రిల్లర్‌‌‌‌ నుండి ‘కొల్హాపూర్‌‌‌‌ కీ బిజ్లీ’ అంటూ సాగే మాస్‌‌ సాంగ్‌‌ను నిన్న విడుదల చేశారు. బాలీవుడ్‌‌లో ఇప్పటికే వచ్చిన పలు మసాలా సాంగ్స్‌‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో దీన్ని కంపోజ్ చేశారు సచిన్ జిగార్.  

కియారా కూడా స్టన్నింగ్ లుక్స్, రొమాంటిక్ ఎక్స్‌‌ప్రెషన్స్, ఇంప్రెసివ్‌‌ డ్యాన్స్‌‌ మూమెంట్స్‌‌తో ఆకట్టుకుంది. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశాడు.  విక్కీ, కియారా ఆన్‌‌ స్క్రీన్‌‌ కెమిస్ట్రీ సాంగ్‌‌కు హైలైట్‌‌గా నిలిచింది. గతంలో ఈ తరహా స్పెషల్ సాంగ్స్ చేసిన కరీనా, కత్రినాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో  ‘బిజిలీ’గా మెస్మరైజ్ చేసింది కియారా. ఫస్ట్ టైమ్ ఆమె నటిస్తోన్న ఈ ఔట్ అండ్ ఔట్ మసాలా ఎంటర్‌‌‌‌టైనర్ డిసెంబర్ 16న డిస్నీ ప్లస్ హాట్‌‌ స్టార్‌‌‌‌లో స్ట్రీమ్ కానుంది. మరోవైపు రామ్ చరణ్‌‌కు జంటగా శంకర్ సినిమాలో నటిస్తోంది కియారా. ప్రస్తుతం న్యూజిలాండ్‌‌లో పాట తీస్తున్నారు. షూటింగ్‌‌ గ్యాప్‌‌లో చరణ్‌‌తో కలిసి బర్గర్‌‌‌‌ తింటూ, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందామె.