జెండా పట్టుకోవడం చేతకావడంలేదా.. కియారాపై రెచ్చిపోతున్న నెటిజన్స్

జెండా పట్టుకోవడం చేతకావడంలేదా.. కియారాపై రెచ్చిపోతున్న నెటిజన్స్

స్వాతంత్ర దినోత్సవానికి ముందు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తన షూటింగ్స్ నుండి కాస్త బ్రేక్ తీసుకుంది. అట్టారీ-వాఘా సరిహద్దులో బీఎస్ఎఫ్(BSF) సైనికులతో కొంత సమయం గడిపింది. దీనికి సంబంధించిన వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అయితే అందులోని ఒక వీడియోలో జెండా ఊపడానికి చాలా ఇబ్బంది పడింది కియారా. కనీసం జెండా కూడా సరిగా పట్టుకోలేకపోయింది. దీంతో ఆ వీడియో చుసిన నెటిజన్స్ కియారాపై మండిపడుతున్నారు. కామెంట్స్ తో ట్రోల్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు.  అందులో ఒకరు.. జాతీయ జెండా అనేది మన దేశానికి గర్వకారణం. దయచేసి దానిని మీ ఫోటో షూట్స్ కోసం వాడుకొని అవమానించకండి అని, ఈమె లాంటి డబ్బర్ ను నేను ఎక్కడ చూడలేదు.. జెండా ఊపడం కూడా రావడంలేదు కానీ ఫోటోలకు మాత్రం పోజులు ఇస్తోందంటూ కామెంట్ చేశారు. మరొకరెమో.. జాతీయ జెండాను పట్టుకున్నప్పుడు శ్రద్దగా ఉండాలి కానీ.. ఆమె అక్కడ కూడా నటిస్తూనే ఉంది అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. 

ఇక కియారా సినిమా విషయాలకొస్తే.. ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా వస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అంజలి, SJ సూర్య, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నాజర్ సహాయక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.