‘విక్రాంత్ రోణ’ ట్రైలర్ రిలీజ్

‘విక్రాంత్ రోణ’ ట్రైలర్ రిలీజ్

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘విక్రాంత్ రోణ’. విజువల్ వండర్ గా రానున్న ఈ మూవీకి అనుప్ భండారి దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్ ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. జూలై 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను వదిలారు మేకర్స్.

 గురువారం సాయంత్రం 5:02 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. సుదీప్ ఇందులో పోలీస్ అధికారిగా, డెవిల్ ప్రాత్రలో కనిపించబోతున్నాట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో నిరూప్ భండారి, నీతా అశోక్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైనసాంగ్స్‌,టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.