సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కిడ్నాప్ కు గురైన 5 యేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించారు జీఆర్పీ పోలీసులు. కొన్నిగంటలో బాలుడి ఆచూకీని కనిపెట్టారు. సైబర్ టవర్స్ వద్ద బాలుడిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ అయ్యాడు. నిన్న సాయంత్రం (సెప్టెంబర్ 29) ఫ్లాట్ ఫారమ్ నెంబర్ 1 వద్ద బాలుడు కనిపించకుండా పోయాడు. ప్లాట్ ఫారమ్ పై ఉంచి వాష్ రూం వెళ్లి వచ్చే లోపు ఫ్లాట్ ఫారమ్ పై ఉంచిన బాలుడు అదృశ్యమయ్యాడు. ఎంత వెదికినా బాలుడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాలుడి తండ్రి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్ళనట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు జీఆర్పీ పోలీసులు.
మెదక్ వెళ్లేందుకు సికింద్రాబాద్ స్టేషన్ బాలుడితో కలిసి వచ్చారు తల్లిదండ్రులు. ప్లాట్ ఫారమ్ 1 వద్ద బాలుడు ఆడుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు బాలుడిని ఎత్తుకెళ్లారు ఈ విషయం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే బెగ్గింగ్ మాఫియా పనే అయి వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.