జూన్ 28న నెఫ్రో కేర్ ఇండియా ఐపీఓ

జూన్ 28న నెఫ్రో కేర్ ఇండియా ఐపీఓ

న్యూఢిల్లీ : కిడ్నీ కేర్ ​ప్రొవైడర్​ నెఫ్రోకేర్​ ఇండియా ఐపీఓ ఈ నెల 28న మొదలై జులై రెండో తేదీన ముగుస్తుంది.  ఒక్కో షేరు ధరను రూ. 85–-90గా నిర్ణయించారు. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ జూన్ 27న ఉంటుందని తెలిపింది.  ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఎగువ ముగింపులో రూ. 41.26 కోట్ల విలువైన 45.84 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేసింది.

ఇష్యూ తర్వాత, కంపెనీ షేర్లు ఎన్​ఎస్​ఈ ఎమర్జ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిస్ట్​ అవుతాయి. ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బును ఆస్పత్రుల నిర్మాణానికి వాడుతామని నెఫ్రో కేర్​ తెలిపింది.  కంపెనీ 2023–-24 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో రూ. 19.75 కోట్ల ఆదాయాన్ని, రూ. 3.4 కోట్ల లాభాన్ని  ఆర్జించింది.