స్కూల్ బస్సులో మంటలు.. నలుగురు పిల్లలు సజీవదహనం

స్కూల్ బస్సులో మంటలు.. నలుగురు పిల్లలు సజీవదహనం

పంజాబ్ లో విషాదం జరిగింది. స్కూల్ వ్యాన్ లో   చెలరేగిన మంటల్లో నలుగురు విద్యార్ధులు సజీవ దహనమయ్యారు. పంజాబ్ లాంగోవల్ పట్టణం సంగ్రూర్‌ కు చెందిన సిమ్రాన్ పబ్లిక్ స్కూల్ వ్యాన్ లో  మంటలు చెలరేగాయి. స్కూల్ ముగించుకొని 12మంది విద్యార్ధులు స్కూల్ వ్యాన్  లో ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో వ్యాన్ లో  మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన  డ్రైవర్, స్థానికులు 8మంది విద్యార్ధుల్ని ప్రమాదం నుంచి రక్షించారు. మరో నలుగురు విద్యార్ధులు సజీవదహనమయ్యారు. ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం గురించి ఆరా తీసిన పోలీసులు ..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.