రూ.200 కోసం తండ్రిని చంపిండు

రూ.200 కోసం తండ్రిని చంపిండు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మందు తాగేందుకు డబ్బులు ఇయ్యలేదని కన్న తండ్రిని చంపేశాడు ఓ కొడుకు. సీఐ వేణుచందర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెంలోని బూడిదగడ్డకు చెందిన గోసిక కొమరయ్య(59) సింగరేణిలో కార్మికుడిగా పనిచేసి ఇటీవలే రిటైర్ ​అయ్యాడు. భార్యతోపాటు నలుగురు పిల్లలు ఉన్నారు. కూతుళ్లు ఇద్దరికి, పెద్దకొడుకు రవికి పెండ్లిళ్లు చేసేశాడు. చిన్నకొడుకు శివప్రసాద్​కు పెండ్లి కావాల్సి ఉంది. తొలి ఏకాదశి సందర్భంగా మంగళవారం రాత్రి రవికి కొమరయ్య రూ.600 ఇచ్చి కోడిని తెప్పించి కోయించాడు. వండుకుని తింటున్న టైంలో శివప్రసాద్ రూ.200 కావాలని తండ్రిని అడిగాడు. మందు తాగేందుకు తాను డబ్బులు ఇవ్వనని కొమరయ్య చెప్పాడు. దాంతో కోపం పెంచుకున్న శివప్రసాద్​అంతా పడుకున్నాక రోకలిబండతో తండ్రి తలపై కొట్టి చంపాడు.