కిమ్​ చేసిన బ్లాక్ మ్యాజిక్​!

V6 Velugu Posted on Sep 15, 2021

అది న్యూయార్క్​లోని మెట్రోపాలిటన్​ మ్యూజియం ఆఫ్​ ఆర్ట్. ‘మెట్​ గాలా 2021’ ఈవెంట్ జరుగుతోంది. హాలీవుడ్​ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా రెడ్​ కార్పెట్​ మీద ఫ్యాషన్​ డ్రెస్సులు వేసుకుని స్టయిలిష్​గా నడుస్తున్నారు. ఫొటోలకి పోజులిస్తున్నారు. అంతలోనే తల నుంచి పాదాల వరకు నల్లటి డ్రెస్​ వేసుకున్న ఒకరు నడుచుకుంటూ వచ్చారు అక్కడికి. బ్లాక్ డ్రెస్​ వేసుకుని మ్యూజియంలోకి ఎంట్రీ ఇచ్చింది ఎవరో కాదు...  అమెరికన్​ నటి కిమ్​ కర్దాషియాన్. నల్లని పోనీటెయిల్​, బ్లాక్ గౌన్​కి మ్యాచింగ్ మాస్క్​ పెట్టుకుని, శాండిల్స్​ వేసుకున్న కిమ్​ని చూసి అక్కడివాళ్లంతా షాకయ్యారు. కెమెరాలన్నీ ఆమెవైపు తిరిగాయి. ముఖం కూడా కనిపించకుండా నల్లని ముసుగు వేసుకున్నట్టు ఉన్న ఆమెని ముందుగా ఎవ్వరూ గుర్తుపట్టలేదు. ఫండ్​ రైజింగ్​ కోసం నిర్వహించిన ఈవెంట్​కి బెలెన్సియాగ కంపెనీ క్రియేటివ్​ డిజైనర్​ డెమ్నా గ్వసాలియాతో కలిసి వెళ్లింది కిమ్. గాలా ఈవెంట్​కి స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచిన ఆమె అవుట్​ఫిట్​ ఇప్పుడు నెట్​లో వైరల్​ అవుతోంది.
ఫ్యాషన్​ అంటే పిచ్చి
కిర్దాషియానాకి ఫ్యాషనబుల్​గా కనిపించడం చాలా ఇష్టం. అందుకోసం వెరైటీ అవుట్​ఫిట్స్​ వేసుకుంటుంది కూడా.  ఈసారి ‘మెట్​గాలా’ ఈవెంట్​ని సీరియస్​గా తీసుకున్న కిమ్​ తన స్పెషాలిటీ చూపించాలనుకుంది. ఆమె అనుకున్నట్టుగానే ‘మెట్​ గాలా’ డ్రెస్​ సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Tagged viral, Kim Kardashian, , Decodes, Gala Look, American Than

Latest Videos

Subscribe Now

More News