కైనెటిక్‌‌‌‌ గ్రీన్ నుంచి జులు స్కూటర్‌‌‌‌‌‌‌‌

కైనెటిక్‌‌‌‌ గ్రీన్ నుంచి జులు స్కూటర్‌‌‌‌‌‌‌‌

ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే కైనెటిక్ గ్రీన్‌‌‌‌  జులు పేరుతో కొత్త మోడల్‌‌‌‌ లాంచ్ చేసింది. ఈ బండిలో 2.27 కిలోవాట్అవర్‌‌‌‌‌‌‌‌ బ్యాటరీని అమర్చారు. 80 శాతం ఛార్జింగ్‌‌‌‌ కేవలం 30 నిమిషాల్లోనే పూర్తవుతుందని కంపెనీ పేర్కొంది.

ఫుల్ ఛార్జ్‌‌‌‌పై 104 కి.మీ వెళుతుందని, గరిష్ట స్పీడ్‌‌‌‌ గంటకు 6‌‌‌‌‌‌‌‌0 కిలోమీటర్లని వెల్లడించింది. ధర రూ.94,990 నుంచి  (ఎక్స్‌‌‌‌షోరూమ్‌‌‌‌ ముంబై) మొదలవుతోంది.