విరాట్‌‌‌‌‌‌‌‌ సెంచరీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

విరాట్‌‌‌‌‌‌‌‌ సెంచరీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

న్యూఢిల్లీ : క్రికెట్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టి మొన్నటితో 14 ఏళ్లు పూర్తి చేసుకున్న కింగ్‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ.. ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.  ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్​ల్లో విరాట్‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేయక వెయ్యి రోజులైంది. 23 నవంబర్‌‌‌‌‌‌‌‌ 2019 ఈడెన్‌‌‌‌‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై చివరిసారి సెంచరీ సాధించాడు. అప్పట్నించి తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో కోహ్లీ ఎత్తుపల్లాలు చవిచూస్తునే ఉన్నాడు. అయితే మరో వారం రోజుల్లో ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ మొదలుకాబోతున్న తరుణంలో ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ అందరూ విరాట్‌‌‌‌‌‌‌‌ సెంచరీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌ కోసం కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ కూడా మొదలుపెట్టాడు. క్రికెట్‌‌‌‌‌‌‌‌ లెజెండ్స్‌‌‌‌‌‌‌‌ గావస్కర్‌‌‌‌‌‌‌‌, సచిన్‌‌‌‌‌‌‌‌, ద్రవిడ్‌‌‌‌‌‌‌‌, పాంటింగ్‌‌‌‌‌‌‌‌.. తమ కెరీర్‌‌‌‌‌‌‌‌లో చాలాసార్లు ఫామ్‌‌‌‌‌‌‌‌ కోల్పోయారు. కానీ ఏ ఒక్కరు కూడా సెంచరీ చేయకుండా వెయ్యి రోజులు ఉండలేదు.