కింగ్ ఫిషర్ బీర్లు ఇక దొరకవా..మన దగ్గర ఉన్న కేఎఫ్ బీర్లు ఆరోగ్యకరమైనవేనా..

కింగ్ ఫిషర్ బీర్లు ఇక దొరకవా..మన దగ్గర ఉన్న కేఎఫ్ బీర్లు ఆరోగ్యకరమైనవేనా..

మద్యం ప్రియులకు మందు కంటే..బీర్లపైనే మోజెక్కువ. ముఖ్యంగా యువకులకు బీర్లంటే మహా ఇష్టం. అయితే ఎన్ని రకాల కంపెనీల బీర్లు ఉన్నా కూడా..యువకులు కింగ్ ఫిషర్ బీర్లనే ఎక్కువగా తాగేందుకు ఇష్టపడతారు. అంతలా ప్రజాదరణ పొందింది కింగ్ ఫిషర్ బీర్. అయితే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో తయారు చేస్తున్న బీర్లలో నిషేధిత కెమికల్ ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలడంతో అక్కడి బీర్లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. దీంతో  ఇతర రాష్ట్రాల్లోని అమ్ముతున్న కింగ్ ఫిషర్ బీర్లు ఆరోగ్యకరమైనవేనా.. అందులో కూడా నిషేధిత కెమికల్ పదార్థాలు ఉన్నాయా అన్న అనుమానాలను మద్యం ప్రియులు వ్యక్తం చేస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో అన్ని వైన్స్లలో ఎన్ని రకాల కంపెనీల బీర్లున్నా..జనాలు మాత్రం కింగ్ ఫిషర్ బీర్లకే ఓటేస్తారు. అందుకే ప్రతీ వైన్ షాపులో కింగ్ ఫిషర్ బీర్లు అత్యధికంగా అమ్ముడవుతాయి. అంతలా మద్యం ప్రియకులకు కింగ్ ఫిషర్ బీర్లంటే ఇష్టం. సాధారంగా కింగ్ ఫిషర్ బీర్లలో  కేఎఫ్ లైట్, కేఎఫ్ స్ట్రాంగ్, కేఎఫ్ మాగ్నమ్ స్ట్రాంగ్, కేఎఫ్ స్ట్రాంగ్ ఫ్రెష్, కేఎఫ్ డ్రాట్, కేఎఫ్ అల్ర్టా, కేఎఫ్ బ్లూ, కేఎఫ్ రెడ్, కేఎల్ లార్జర్, కేఎఫ్ స్ట్రామ్ వంటి రకాల బీర్లు ఉంటాయి. అయితే ఇందులో కేఎఫ్ లైట్, కేఎఫ్ స్ట్రాంగ్ బీర్లే ఎక్కువగా అమ్ముడవుతాయి. అయితే ఇప్పుడు కేఎఫ్ స్ట్రాంగ్, కేఎల్ అల్ట్రా బీర్లలో నిషేధిత కెమికల్ పదార్థాలు ఉన్నట్లు తేలడంతో ఈ బీర్ల అమ్మకాలపై ప్రభావం చూపనుంది.  ఈ బీర్ల అమ్మకాలను కూడా ఇక్కడి వైన్స్లలో నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

కర్ణాటక రాష్ట్రం మైసూర్ లోని కింగ్ ఫిషర్ బీర్ల తయారీ కంపెనీలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసి నిషేధిక కెమికల్స్ ఉన్నట్లు తేలిన నేపథ్యంలో..తెలుగు రాష్ట్రాల్లోని కింగ్ ఫిషర్ బీర్ల తయారీ కంపెనీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తారని తెలుస్తోంది. తెలంగాణ, ఏపీలోని కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీల్లో తయారు చేస్తున్న బీర్లు ఆరోగ్యకరమైనవేనా..లేదా ఇందులో కూడా ఏమైనా నిషేధిత కెమికల్ పదార్థాలు ఉన్నాయా అని తనిఖీలు చేసే ఛాన్సుంది. అదే జరిగితే ఇక్కడ బీర్లు ఎంత వరకు జనాలకు సేఫ్ అనేది తేలిపోనుంది. తెలంగాణ, ఏపీతో పాటు..దేశంలో ఎక్కడెక్కడ కింగ్ ఫిషర్ బీర్ల తయారీ కంపెనీలపై ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. అయితే ఒక్క మైసూరులోనే 10 లక్షల బీర్ బాటిళ్లు సీజ్ చేస్తే..తెలంగాణ, ఏపీతో పాటు..ఇతర రాష్ట్రాల్లోని బీర్ల కంపెనీల్లో తయారు చేస్తున్న బీర్లలో కెమికల్ ఉన్నట్లు తేలితే..ఇంకెన్ని కోట్ల బీర్ బాటిళ్లను అధికారులు సీజ్ చేస్తారో అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. 

కర్ణాటకలో బీర్లలో నిషేధిత కెమికల్ పదార్థాలు ఉన్నట్లు తాజాగా వెలుగులోకి రావడంతో అవి జనాల ప్రాణాలకు ముప్పు అని  ప్రస్తుతం 10 లక్షల బీర్ బాటిళ్లను అక్కడి అధికారులు సీజ్ చేశారు. అయితే అప్పటికే కంపెనీ నుంచి డిస్పాచ్ అయి..వైన్స్ లకు చేరిన తర్వాత ఆ బీర్లను తాగిన మద్యం ప్రియుల పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం ఆలోచించాల్సిన విషయం. వారు భవిష్యత్ లో ఎలాంటి ఆనారోగ్యాలకు గురవుతారు. వారు ఎలాంటి రోగాల బారిన పడతారన్నది ప్రస్తుతం భయాందోళనకు గురి చేస్తోంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అప్పటికే బీర్లు తాగిన ప్రజలు..తమకేమైనా అవుతుందా అని ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.