న్యూఢిల్లీ : ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ డబుల్ హ్యాట్రిక్ సాధించింది. గురువారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో హైదరాబాద్ 12–11తో కోచి కేడీఎస్‌పై గెలిచింది. దీంతో లీగ్‌లో ఏడో విజయం, వరుసగా ఆరో గెలుపుతో సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. అండర్ కార్డ్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ రెండు విజయాలు సాధించింది.
ఉజ్వల్ అగర్వాల్ 0–1తో ఓడినా.. తర్వాతి మ్యాచ్‌ల్లో స్టీవ్ థామస్ 1–0తో సూరజ్ సాల్హోత్రాపై, సవితా కుమారి 1–0తో రజిని రాజ్‌పినిపై నెగ్గారు. మెయిన్ కార్డ్ మ్యాచ్‌ల్లోనూ జగదీష్ 5–0తో సమీర్ టీవీపై, అస్కర్ అలీ 5–0తో అభిషేక్‌ను ఓడించాడు. మూడో గేమ్‌లో జిన్సీ జోష్ నిరాశపర్చింది.
