
కిరణ్ అబ్బవరం హీరోగా రమేష్ కాదూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మీటర్’. అతుల్య రవి హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పాటలతో ఇంప్రెస్ చేసిన టీమ్.. ఇప్పుడు ట్రైలర్‌కి ముహూర్తం పెట్టారు. ఈ నెల 29న శ్రీరామ నవమి సందర్భంగా ట్రైలర్ విడుదల చేస్తున్నామంటూ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
ఇది పక్కా కమర్షియల్ సినిమా అని, ఇందులో కిరణ్ పవర్‌ఫుల్ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్టు చెప్పాడు దర్శకుడు. కిరణ్ లుక్, క్యారెక్టర్ కొత్తగా ఉంటాయని..తన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో దీన్ని నిర్మించాం అన్నారు నిర్మాతలు. ఏప్రిల్ 7న సినిమా విడుదల కానుంది. సాయి కార్తీక్ సంగీతం అందించాడు.