క టైటిల్‌‌తో..

క టైటిల్‌‌తో..

కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టైటిల్‌‌ను బుధవారం ప్రకటించారు. పీరియాడిక్​ థ్రిల్లర్‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘క’ అనే ఆసక్తికరమైన టైటిల్‌‌ను నిర్ణయించారు. శ్రీచక్రాస్ ఎంటర్​టైన్మెంట్స్ బ్యానర్‌‌‌‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుజీత్, సందీప్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  టైటిల్‌‌తోనే ఆసక్తి రేపుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలను త్వరలో రివీల్ చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు.