నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన వీరులకు గుర్తింపు

నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన వీరులకు గుర్తింపు

హైదరాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని స్మరించుకొనున్నట్లు ఆయన తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం అని నినాదించి జైలుకు వెళ్లిన వందేమాతరం రామచందర్ రావు కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి ఇవాళ బేగంబజార్ లో కలిశారు. 

75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన వీరులకు గుర్తింపు దక్కలేదని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏడాది పాటు వారిని స్మరించుకుంటూ... వారి జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తామన్నారు. 1948లో అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ నగరంలో జాతీయ జెండాను ఎగురవేసి నిజాం పాలనకు చరమగీతం పాడరాని.. ఈ ఏడాది సెప్టెంబర్17న హైదరాబాద్ నగరంలో హోమ్ శాఖ మంత్రి అమిత్ షా జాతీయ జెండా ఎగురవేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.