అక్చర్ సాహెబ్ ఆర్టిస్ట్ చిత్రాల ప్రదర్శనలో కిషన్ రెడ్డి

అక్చర్ సాహెబ్ ఆర్టిస్ట్ చిత్రాల ప్రదర్శనలో కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కోట్ల రూపాయలు దొరికాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ గ్రేట్ మాస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ ఢిల్లీలో కాదు.. లండన్ లో కూడా పెట్టుకోవచ్చంటూ ఆయన ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారం పై న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పార్టీలకు పార్టీలను టీఆర్ఎస్ లో కలుపుకుంది ఎవరో అందరికి తెలుసునన్నారు. ఇతర పార్టీలో గెలిచిన వారిని డబ్బులు పెట్టి కొనే సంస్కృతిని తీసుకువచ్చింది కేసీఆర్ కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

ఢిల్లీలోని ఆర్ట్స్ గ్యాలరీ భవన్ లో అక్బర్ సాహెబ్ ఆర్టిస్ట్ చిత్రాల ప్రదర్శన కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ మోడీ చిత్రాలతో పాటు 50కి పైగా చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. నరేంద్ర మోడి చిన్న నాటి నుంచి ప్రధాని పదవి వరకు చేపట్టిన కార్యక్రమాలు, దేశంలో తీసుకు వచ్చిన మార్పులను తెలియజెప్పే పెయింటింగ్ లను దుబాయ్ లో ఉండే అక్బర్ అధ్బుతంగా చిత్రీకరణ చేశారు. అద్భుతమైన అంతర్జాతీయ ప్రమాణాలతో దుబాయ్ లో ఉండే అక్బర్ పెయింటింగ్ లతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు.