సమ్మక్క,సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభించిన కిషన్ రెడ్డి

సమ్మక్క,సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభించిన కిషన్ రెడ్డి

ములుగు : సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తాత్కలిక క్యాంపస్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి..  మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపుతూ.. జాకారంలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. 335 ఎకరాలకు గాను,50 ఎకరాలు ఇంకా భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. పూర్తిస్థాయిలో భూసేకరణ కాగానే యూనివర్సిటీ భవనాల శాశ్వత నిర్మాణం చేపడతామన్నారు. సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీకి హైదరాబాదులోని సెంట్రల్‌ యూనివర్సిటీ మెంటర్‌గా పనిచేస్తుందన్నారు. 

ALSO READ :- బీజేపీలోకి సీతారాం నాయక్..?

భూసేకరణ పూర్తికాగానే దేశ ప్రధానిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి భూమి పూజ చేపిస్తామన్నారు. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో 35 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించేలా చూస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అంతకు మందు వేములవాడలోని వేయిస్తంబాల గుడిని కిషన్ రెడ్డి సందర్శించారు. ఆలయంలో పునర్నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. యాగశాలలో శాంతి హోమం చేశారు.