
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
జూబ్లీహిల్స్, వెలుగు: గత పదేండ్లుగా కేసీఆర్ హయాంలో తెలంగాణ బందీగా ఉన్నదని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్‌గూడలో స్థానిక నాయకుడు రాగుల సాయి కృష్ణ ఆధ్వర్యంలో పలువురు ఆదివారం బీజేపీలో చేరారు.
వీరికి కిషన్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నేతలు లంకాల దీపక్‌రెడ్డి, గౌతంరావు, ప్రేమ్‌కుమార్, అట్లూరి రామకృష్ణ, కిలారి మనోహర్ ఉన్నారు.