రాష్ట్రాల సూచ‌న మేర‌కే లాక్ డౌన్ పొడిగింపు

రాష్ట్రాల సూచ‌న మేర‌కే లాక్ డౌన్ పొడిగింపు

ఢిల్లీ: రాష్ట్రాల‌, అధికారుల సూచన మేరకు లాక్ డౌన్ మరో సారి పెంచామని తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. అన్ని రాష్ట్రాలు కరోనా కట్టడికి లాక్ డౌన్ పెంచాలని కేంద్రాన్ని కోరాయని.. ఏకాభిప్రాయం తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.అందులో భాగంగానే అన్ని ప్రాంతాల్లో పరిమితితో కూడిన‌ అనుమతులు ఇచ్చామన్నారు. కరోనాను కట్టడి చేస్తూనే, ప్రజలకు సౌలభ్యాలు కల్పించడం కోసం లాక్ డౌన్ నిబంధనలు రూపొందించామ‌ని చెప్పారు. రాష్ట్రలు ఇచ్చిన ఆధారంగానే కంటోన్మెంట్, గ్రీన్, రెడ్, అరేంజ్ ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చామని.. దేశవ్యాప్తంగా 130 రెడ్ జోన్ల్, 284 ఆరెంజ్ జోన్ల్, 319 గ్రీన్ జోన్లు జిల్లాకు ఉన్నాయన్నారు.

కంటోన్మెంట్ ప్రాంతాల్లో కఠినంగా వ్వహరించాలి, కరోనా కట్టడి చేయాలి అంటే రాష్టలు ఈ కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు ఇవ్వదన్నారు కిష‌న్ రెడ్డి. దేశవ్యాప్తంగా రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతున్నాయని..ఎక్కువగా కేసులు రెడ్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో నుంచి వస్తున్నాయని తెలిపారు. ఆరెంజ్, గ్రీన్ జోన్ల్ లో కూడా కొన్ని నిబంధనలు పాటించాల‌న్నారు. చాలా జిల్లాలో కరోనా కేసులు నమోదు కాలేదని.. రెడ్ జోన్లలో ఉన్న కంటైన్మెంట్ జోన్ మీద ప్రత్యేక దృష్టి పెడుతూ విధివిధానాలు రాష్ట్రాలు ఇచ్చే సమాచారం ఆధారంగానే జోన్ల వర్గీకరణ జ‌రిగింద‌న్నారు. దేశంలో గత 24 గంటల్లో అత్యధికంగా 2,293 కేసులు నమోదు కాగా.. 1,218 మరణాలు చోటుచేసుకున్నాయన్నారు. ఇవన్నీ దాదాపు రెడ్ జోన్ల లోని కంటైన్మెంట్ జోన్లలోనే ఎక్కువగా న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. లాక్ డౌన్ స్పిరిట్ ను దృష్టిలో పెట్టుకొని వెసులుబాటు ఉపయోగించుకోవాలని తెలిపారు కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి‌ కిషన్ రెడ్డి.