దగ్గు సమస్య ఉందంటే ప్రశాంతత మనకీ ఉండదు.. ఇంట్లో వాళ్లనీ ప్రశాంతంగా ఉండనీయదు. ఎందుకంటే దగ్గుతో నోటి నుంచి వచ్చే గాలికి వేగం ఎక్కువ. క్రిములు కూడా అంతే వేగంగా వస్తాయి. అది ఎదుటివారికి ఇబ్బంది చేస్తుంది కూడా. ఇందులో పొడి దగ్గు, కఫంతో కూడిన దగ్గు ఉంటుంది. గాలి కాలుష్యం వల్ల శాసకోశ సమస్యలు తలెత్తి ఊపిరి ఆడనివ్వదు. దీంతో దగ్గు, కఫం సమస్యలొస్తాయి. అయితే.. వంటింటి చిట్కాలతో దగ్గుకు చెక్ పెట్టొచ్చు..
పొడి దగ్గు ఎక్కువ మందిని వేధిస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ఇంటి చిట్కాలు పాటిస్తే దగ్గు నుంచి త్వరగా బయటపడొచ్చు. ఇంట్లోనే దొరికే కొన్ని పదార్థాలతో దగ్గును సులభంగా తగ్గించుకోవచ్చు.
- ఉల్లిపాయలకు దగ్గు, జలుబులను తగ్గించే శక్తి ఉంటుంది. ఇందుకోసం ఒకటి లేదా రెండు ఉల్లిపాయల్ని జ్యూస్ చేయాలి. ఒక టీ స్పూన్ ఉల్లి రసం తీసుకుని, అందులో అంతే మోతాదులో తేనె కలపాలి. మూడు గంటలపాటు అలాగే ఉంచి, ఆ తర్వాత రసాన్ని తాగాలి. ఇలా రోజూ రెండుసార్లు చేస్తే దగ్గు తగ్గిపోతుంది.
- ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే పసుపు యాంటీబ యాటిక్ గా పని చేస్తుంది.
- దగ్గు నివారణలో అల్లం సమర్ధమంతంగా పనిచేస్తుంది. అల్లాన్ని నేరుగా, లేదా ఉప్పుతో కలిపి తినొచ్చు. ఒకవేళ నేరుగా తినలేమనుకుంటే అల్లాన్ని రసంలా చేయాలి. దీనిలో చక్కెర, మిరియాలు కలిపి తాగినా మంచి ఫలితం ఉంటుంది. అల్లం రసాన్ని తేనెతో కూడా కలుపుకుని తాగొచ్చు. ఈ మిశ్రమాన్ని రోజు మూడుసార్లు తీసుకోవాలి.
- వంద గ్రాముల ఎండు ద్రాక్షని తీసుకుని, ఒక బౌల్ వాటర్ తో కలిపి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్ర మంలో 100 గ్రాముల చక్కెర కలిపి వేడి చేయాలి. అది కాస్త చల్లారాక కొద్దికొద్దిగా తాగుతూ ఉంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
లైఫ్, వెలుగు
