రోజూ వంటింట్లో గంటల తరబడి శ్రమించినా కొన్ని పనులు మాత్రం చాలా విసుగు తెప్పిస్తుంటాయి. కొత్త గిన్నెలపై స్టిక్కర్లు రాకపోవడం, వెల్లుల్లి పొట్టు వలవడం, నూనె చిందడం వంటి చిన్న చిన్న సమస్యలు వంట పనిని మరింత ఆలస్యం చేస్తాయి. ఇలాంటి ఇబ్బందులను ఈజీగా అధిగమించి, మీ టైం ఆదా చేసే కొన్ని అద్భుతమైన, సులువైన వంటింటి చిట్కాలు మీకోసం...
గిన్నెలపై స్టిక్కర్లు
గాజు గిన్నెలు, గ్లాసులపై లేబుల్స్ తీయడం కాస్త కష్టమైన పనే. కానీ, గోరు వెచ్చని నీళ్లలో గాజు గ్లాసులు, గిన్నెల స్టిక్కర్ వైపు భాగాన్ని ఉంచితే.. ఆ వేడికి స్టిక్కర్స్ వెనకున్న గమ్ము అంతా కరిగి లేబుల్స్ తేలిగ్గా వచ్చేస్తాయి.
పాలు ఎక్కువసేపు వేడిగా ఉండాలంటే
ఫ్లాస్క్ లో పాలు ఎక్కువసేపు వేడిగా ఉండాలంటే... ముందుగా అందులో వేడి నీళ్లు పోసి మూతపెట్టాలి. పావుగంట తర్వాత ఆ నీళ్లు తీసేసి వేడి పాలు పోయాలి.
వెల్లుల్లి పొట్టు ఈజీగా తీయాలంటే
వెల్లుల్లి పొట్టు తేలికగా తీయాలంటే వాటిని ఎండలో మూడు గంటలు ఉంచాలి. తర్వాత వాటిని కాటన్ క్లాత్ లో వేసి మూటగట్టి రబ్బరు బ్యాండ్ పెట్టాలి. చపాతీ కర్రతో ఆ మూటని ప్రెస్ చేస్తే వెల్లుల్లి పొట్టు తేలిగ్గా వస్తుంది.
నూనె పైకి చిల్లకుండా ఉండాలంటే
డీప్ ఫ్రైలు చేసేటప్పుడు నూనె పైకి చిల్లకుండా ఉండాలంటే.. మరుగుతున్న నూనెలో కొద్దిగా నెయ్యి వేసి తర్వాత డీప్ ఫ్రై చేయాలి.
