
ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను ఈ సారి కూడా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఉత్సవాలకు సంబంధించి టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఇంటర్‌నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను నిర్శహిస్తోందన్నారు. ఈ ఏడాది జనవరి 13 నుంచి 15వ తేదీ వరకూ సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో ఈ ఉత్సవాలు జరుగనున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజుల్లో స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో 2020 కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేలా నిర్వహించనున్నట్టు తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు ప్రపంచంలోని వివిధ దేశాలలో గుర్తింపు ఉన్న కైట్ క్లబ్‌లను ఆహ్వానించాలని, పాల్గొనేలా చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఈ ఫెస్టివల్ ను సందర్శించడానికి వచ్చే సందర్శకులకు మెరుగైన సౌకకర్యాలను కల్పించాలన్నారు.