KKR vs LSG మ్యాచ్ పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!

KKR vs LSG మ్యాచ్ పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!

KKR vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2026) సీజన్ లో భాగంగా ఈరోజు (2026, ఏప్రిల్ 9న) కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు తలపడుతున్నాయి. కాగా డిఫెండింగ్ ఛాంపియన్‌గా (2024 విజేత) బరిలోకి దిగిన కోల్‌కతాకు ఈ సీజన్ అస్సలు కలిసిరావడం లేదు.. ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లలో (ముంబై, హైదరాబాద్) ఓడిపోయిన కేకేఆర్, పంజాబ్‌తో జరగాల్సిన గత మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో కేవలం ఒక పాయింట్‌తో 9వ స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ తమ మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోయినప్పటికీ, హైదరాబాద్‌పై అద్భుత విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉంది.

పిచ్ రిపోర్ట్: 
ఈడెన్ గార్డెన్స్ వికెట్ సాధారణంగా బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుంది. ఇక్కడి బౌండరీలు చిన్నవిగా ఉండటం వలన భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ గ్రౌండ్ లో తొలి ఇన్నింగ్స్ లో సుమారు 170 పరుగులు నమోదు అవుతాయి. అలాగే ఈ గ్రౌండ్ లో జరిగిన 102 మ్యాచ్‌లలో 57 సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. 

హెడ్ -టు-హెడ్ రికార్డులు: 
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 6 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో లక్నో 4 విజయాలని నమోదు చేయగా,  కోల్‌కతా కేవలం 2 మ్యాచులలో గెలిచింది. అయితే, ఈ పోరులో లక్నోదే పైచేయి కనిపిస్తుంది. 

వర్షం అడ్డంకీ: 
ఈరోజు కోల్‌కతాలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. సాయంత్రం 7:30 గంటలకు వర్షం పడే సూచనలు చాలా ఎక్కువగా ఉండటంతో టాస్ ఆలస్యం కావడంత ఓపాటు  మ్యాచ్ కూడా లేట్ గా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. 

ఇరు జట్ల అంచనా: 

KKR: ఫిన్ అలెన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి/నవదీప్ సైనీ, బ్లెస్సింగ్ ముజరబానీ, వైభవ్ అరోరా.

LSG: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్/ వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, షాబాజ్ అహ్మద్/సిద్ధార్థ్, మొహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ.