IPL 2024: ఐపీఎల్ మ్యాచ్ వాయిదా..కారణం ఏంటంటే..?

IPL 2024: ఐపీఎల్ మ్యాచ్ వాయిదా..కారణం ఏంటంటే..?

ఐపీఎల్ అభిమానులకు బిగ్ షాక్. ఏప్రిల్ 17న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ మ్యాచ్ వాయిదా పడకపోయినా.. వేదికలో మార్పు చేసే అవకాశం కనిపిస్తుంది. కేకేఆర్, రాజస్థాన్ మ్యాచ్.. రామ నవమి రోజునే జరగనుంది. ఆ రోజు వేడుకలు భారీగా జరగనుండడంతో.. మ్యాచ్‌కు తగిన భద్రత అందించగలమా లేదా అని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. దీంతో బీసీసీఐ ఈ మ్యాచ్ ను రీ షెడ్యూల్ చేయడం లేదా వేదికను మార్చాలని భావిస్తోందట. భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్,బీసీసీఐ కోల్‌కతా పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఐపీఎల్ ఉన్నతాధికారి ఒకరు క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. పోలీసు అధికారులతో చర్చలు జరుగుతున్నాయని .. త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 

ALSO READ :- MI vs RR: ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ పోరుకు వర్షం ముప్పు!

ప్రస్తుతం ఐపీఎల్ ఎలాంటి అడ్డంకులు లేకుండా జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లో దాదాపు అన్ని జట్లు సొంతగడ్డపై ఆడి విజయం సాధించాయి. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ లో అదరగొడుతున్నాయి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి హ్యాట్రిక్ పై కన్నేశాయి. ఇక ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనుంది.