ఇమ్యూనిటీ పాస్‌‌పోర్ట్..కాన్సెప్ట్ ఏంటంటే..

ఇమ్యూనిటీ పాస్‌‌పోర్ట్..కాన్సెప్ట్  ఏంటంటే..

ఇమ్యూనిటీ పాస్‌‌పోర్ట్ గురించి తెలుసా? కోవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని అందరికీ తెలిసిందే. అయితే ఫ్యూచర్‌లో మన జేబులో ఒక కొత్త కార్డు చేరబోతోంది. అదే ఇమ్యూనిటీ పాస్ పోర్ట్. అసలీ కాన్సెప్ట్ ఏంటంటే..

రెగ్యులర్ పాస్‌‌‌‌పోర్ట్ లాగానే ఇమ్యూనిటీ పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌లు కూడా ఒకచోటు నుంచి మరొక చోటుకు వెళ్లడానికి అవసరమవుతాయి. ఇదొక హెల్త్ డాక్యుమెంట్ లాంటిది. కోవిడ్ ను ఎదుర్కొన్న వాళ్లకు, యాంటిబాడీ టెస్ట్ ద్వారా తగినంత ఇమ్యూనిటీ ఉందని నిరూపించుకున్న వాళ్లకు ఈ పాస్‌‌‌‌పోర్ట్ ఇస్తారు.  ట్రావెల్ చేయడానికి ఈ పాస్‌‌‌‌పోర్ట్ కచ్చితంగా ఉండాలి. ఈ కాన్సెప్ట్ కొన్ని దేశాల్లో ఇప్పటికే ప్లానింగ్ స్టేజిలో ఉంది. మన దేశంలో కూడా అమలయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

ట్రాకింగ్‌‌‌‌తో ఈజీ

లాక్‌‌‌‌డౌన్ లాంటి పరిస్థితుల్లో బతకడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పాస్‌‌‌‌లతో ప్రాసెస్ ఈజీ అవుతుంది. అయితే దీనికోసం పెద్దమొత్తంలో యాంటీబాడీస్ పరీక్షలు చేసి పాస్‌‌‌‌పోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది. కరోనా లాంటి స్పెసిఫిక్ వైరస్‌‌‌‌ను తట్టుకోవాలంటే.. సంవత్సరాలపాటు శరీరంలో  సరైన ఇమ్యూనిటీ మెయింటెయిన్ అవ్వాలి. అందుకే ఇలాంటి ఇమ్యూనిటీ ట్రాకింగ్ విధానాలు ఫ్యూచర్‌లో ఎంతగానో పని కొచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టెక్ శావీ పాస్‌‌‌‌పోర్ట్స్

బ్రిటన్ లాంటి కొన్ని దేశాల్లో ఇమ్యూనిటీని ట్రాక్ చేసే యాప్స్ కూడా వచ్చేశాయి. హెల్త్ కేర్ అథారిటీస్ ద్వారా మనుషుల ఇమ్యూనిటీ స్టేటస్‌‌‌‌ను ట్రాక్ చేసి, యాప్‌లో డేటా రూపంలో పొందుపరుస్తారు. దీన్ని ‘కరోనా పాస్’ అంటారు. ఇది కూడా ఒక రకమైన డిజిటల్ ఇమ్యూనిటీ పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌లా పనిచేస్తుంది. మనుషుల మధ్య కాంటాక్ట్‌‌‌‌ను తగ్గించడానికి, వాళ్లను ఎలెర్ట్‌ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది.

ఏడ్వడం కూడా మంచిదే