Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. కొత్త డిజిటల్ ఫారం-16 వచ్చేసిందోచ్..

Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. కొత్త డిజిటల్ ఫారం-16 వచ్చేసిందోచ్..

Digital Form-16: వాస్తవానికి ప్రతి ఏటా ఆదాయపు పన్ను దాఖలు చేసేందుకు ఉద్యోగులు, వ్యాపారులు గడువు చివరి సమయంలో ఆందోళన చెందుతూనే ఉంటారు. అయితే చివరి క్షణాల్లో చేసే కొన్ని పనులు ఈ ప్రక్రియలో తప్పులు దొర్లటానికి కారణాలుగా మారుతుంటాయి. 

గతంలో పన్ను చెల్లింపుదారులు పూరించిన పాత ఫారం 16లో పేర్కొన్న జీతం, టీడీఎస్ వివరాలను ఫారం 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లతో సరిపోల్చాల్సి వచ్చేది. ఈ క్రమంలో కొన్నిసార్లు జీతం తక్కువగా ఉండటంతో చెల్లించిన టీడీఎస్ కూడా తక్కువగానే చూపబడేది. దీంతో టీసీఎస్ వాసలు పొందటం ఆలస్యం అయ్యేది. చాలా సార్లు కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ ఫారం 16ను ఆలస్యంగా జారీ చేయటంతో వారు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. 

ALSO READ | అసలు క్రిప్టో కరెన్సీలు ఏంటి..? ఇవి అసలు ఇండియాలో లీగలేనా..? నిపుణుల మాటఇదే..

అయితే ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ కొత్తగా డిజిటల్ ఫారం 16 అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా తక్కువ సమయంలోనే టాక్స్ పేయర్స్ తమ ఐటీఆర్ దాఖలు చేయటం సులభతరంగా మారనుంది. ఎందుకంటే ఈ ఫారమ్ ఇప్పుడు మీ కంపెనీ ద్వారా నేరుగా TRACES పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడుతుంది. ఇది జీతం, టీడీఎస్, సెక్షన్ 80C/80D వంటి తగ్గింపుల పూర్తి వివరాలను కలిగి ఉంటుంది. తద్వారా ఆటోమెటిక్ గా డిజిటల్ ఫారం 16 అందులోని వివరాలతో నింపబడుతుంది. అయితే పన్ను చెల్లింపుదారులు అన్ని వివరాలు సరిగా ఉన్నాయా అనేది మాత్రం తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏవైనా వివరాలు తప్పుగా ఉన్నట్లయితే సిస్టమ్ వెంటనే రెడ్ అలర్ట్ ఇస్తుంది. 

కొత్తగా తీసుకొచ్చిన డిజిటల్ ఫారం 16 వల్ల పన్ను చెల్లింపుదారుల సమయం ఆదా కావటంతో పాటు కంగారులో చేసే తప్పులు లేదా పొరపాట్లను నివారించవచ్చు. అలాగే టైపింగ్ సమయంలో డేటా ఎంట్రీ తప్పులను ముందుగానే నిరోధించటానికి వీలు ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఆదాయపు పన్ను ఇఫైలింగ్ పోర్టల్ లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత పాన్ నంబర్ లింక్ చేయబడిన డిజిటల్ ఫారం 16ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ ఎంచుకోగానే ఆటోమెటిక్ గా ఫారం నింపబడుతుంది. కేవలం మీరు చేయాల్సింది అందులో ఉన్న డేటా సరైనదా కాదా అని చెక్ చేసుకోవటం మాత్రమే.