
Cryptocurrency: వాస్తవానికి ప్రతి దేశం ఒక కరెన్సీని కలిగి ఉంటుంది. అయితే క్రిప్టోలు అని పిలువబడుతున్న కరెన్సీలు డీసెంట్రలైల్జ్ నెట్ వర్క్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా నిర్వహించబడుతున్నాయి. మెుదటగా 2009లో ఫేమస్ బిట్‌కాయిన్ లాంచ్ జరిగింది. ఆ తర్వాత కాలక్రమంలో అనేక కొత్త డిజిటల్ కరెన్సీలు పుట్టుకొచ్చాయి. అయితే ఇండియా లాంటి దేశంలో వీటి లీగల్ చెల్లుబాటు గురించి కోట్ల మంది పెట్టుబడిదారులకు ఎల్లప్పుడూ అనుమానాలు ఉంటూనే ఉంటాయి.
ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలను కలిగి ఉండటం, వాటిలో ట్రేడింగ్ చేయటం లేదా పెట్టుబడులు పెట్టడం చట్టప్రకారం భారతదేశంలో అంగీకరించబడ్డాయి. అయితే ప్రభుత్వం వీటితో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తూ, వాటిని రెగ్యులేట్ చేసేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ ప్రభుత్వాలను కోరుతోంది. అందుకే వీటిని ప్రస్తుతం క్రిప్టో ఆస్తులు అనే కేటగిరీ కింద పరిగణించబడుతున్నాయి. ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిల్లు, వర్చువల్ డిజిటల్ ఆస్తులను క్రిప్టోగ్రాఫికల్‌గా సెక్యూర్డ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్‌లు లేదా లావాదేవీలను ధృవీకరించే సాంకేతికతలపై ఆధారపడే వ్యాల్యూ డిజిటల్ ప్రాతినిధ్యాలుగా స్పష్టంగా పేర్కొనబడింది.
అసలు క్రిప్టో పెట్టుబడులపై భారత ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధిస్తోంది..?
భారతదేశంలో కూడా క్రిప్టోలకు ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణతో కేంద్ర ప్రభుత్వం 2022లో క్రిప్టో ట్రాన్సాక్షన్లపై ఎలాంటి పన్ను వైఖరిని ఫాలో అవ్వాలనేదానిపై నిబంధనలను ప్రవేశపెట్టింది.
* ముందుగా క్రిప్టో పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలపై 30 శాతం పన్ను వసూలుకు నిర్ణయించబడింది.
* ఇక ఏదైనా క్రిప్టో పెట్టుబడిని అమ్మినప్పుడు దాని విలువ ఏడాదిలో రూ.50వేలు దాటితే 1 శాతం టీడీఎస్ వసూలు చేయాలని నిర్ణయించింది.
* ఇక ముఖ్యమైనది క్రిప్టో ట్రేడింగ్ సమయంలో ఏవైనా నష్టాలను పొందితే.. ఇన్వెస్టర్లు వాటికి మినహాయింపులు పొందటం లేదా తర్వాతి ఆర్థిక సంవత్సరాలుకు క్యారీ ఫార్వర్డ్ చేయటం కుదరదని తేల్చి చెప్పేసింది.
ఇక్కడ పన్నులను అధిక స్థాయిలో ఉంచితే ప్రజలు ఈ అసెట్ క్లాక్ లేదా క్రిప్టోలకు దూరంగా జరుగుతారని భారత ప్రభుత్వం గతంలో భావించింది. కానీ ప్రస్తుతం ఇన్వెస్టర్లు వీటిలో కొంత ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని పాలసీ మేకర్లను కోరుతున్నారు.
విదేశాల్లో క్రిప్టోల పరిస్థితి ఎలా ఉంది..?
అసలు క్రిప్టో కరెన్సీలు పుట్టిందే పాశ్చాత్య దేశాల్లో. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూడా ప్రస్తుతం వీటికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఆయన కుటుంబం కూడా వీటికి సంబంధించిన వ్యాపారంలో వెంటర్ నిర్వహిస్తుండగా.. బిట్ కాయిన్, ఇథరమ్ లను దేశానికి స్ట్రాటజిక్ రిజర్వుగా ఉంచాలని నిర్ణయించారు. ఇదే క్రమంలో యూరోపియన్ దేశాలు సైతం క్రిప్టోల కోసం ప్రత్యేక ఫ్లేమ్ వర్క్ అందుబాటులో ఉంచాయి. అలాగే యూఏఈ, సింగపూర్ దేశాల్లో ఉన్న స్టార్టప్ కల్చర్ కారణంగా క్రిప్టోలకు ప్రోత్సాహం లభిస్తోంది. టెక్నాలజీ వినియోగం దశాబ్ధాలు ముందుంటే సౌత్ కొరియా, జపాన్ దేశాలు క్రిప్టోలకు కఠినమైన ప్రత్యేక రెగ్యులేషన్స్ తీసుకొచ్చాయి. మెుత్తానికి ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకుంగా క్రిప్టోలను మెల్లగా ఆర్థిక వ్యవస్థల్లోకి అక్కడి ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి.
వీటి నుంచి భారత ఇన్వెస్టర్లు ఏం గ్రహించాలి..?
క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు ఎవరైనా ముందుగా భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన రిజిస్టర్డ్ ఎక్స్ఛేంజ్ ల ద్వారా ట్రేడింగ్ చేయటం మంచిది. ఇదే క్రమంలో క్రిప్టోలు ఎలా పనిచేస్తాయి, వాటిని ఏవేవి ప్రభావితం చేస్తాయో కూడా ముందుగా తెలుసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యం వాటి నుంచి వచ్చే లాభాలు లేదా నష్టాలపై పన్ను చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో గమనించి ముందుకు సాగటం మంచిది. ఎవరో చెప్పారని కాకుండా క్రిప్టో కరెన్సీల గురించి తగిన రీసెర్చ్ చేసిన తర్వాత ముందుకు సాగటం ఇన్వెస్టర్లకు లేదా ట్రేడర్ల పెట్టుబడి ప్రయాణాన్ని క్లారిటీగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది. క్రిప్టోకరెన్సీలను దేశంలోని ఆర్థిక కార్యకలాపాల్లోకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు సాగటం విస్పష్టంగా కనిపిస్తోందని ప్రముఖ క్రిప్టో ట్రేడింగ్ ఫ్లాట్‌ఫారం గియోటస్ సీఈవో వివేక్ సుబ్బురాజ్ వెల్లడించారు.