ఐటీ రైడ్స్ తర్వాత అదానీ గుప్పిట్లోకి వచ్చేసిన కంపెనీల లిస్ట్ ఇదే..!

ఐటీ రైడ్స్ తర్వాత అదానీ గుప్పిట్లోకి వచ్చేసిన కంపెనీల లిస్ట్ ఇదే..!

అదానీ గడచిన దశాబ్ధకాలంగా భారతదేశంలో తిరుగులేని వ్యాపారవేత్త పేరు. గుజరాత్ నుంచి చిన్న డ్రైమండ్ బ్రోకర్ గా పని స్టార్ట్ చేసిన గౌతమ్ అదానీ ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరు. పైగా భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఆయన కంపెనీలు. పవర్ నుంచి పోర్ట్స్ వరకు దేశానికి వెన్నుముక లాంటి అనేక ఇన్ ఫ్రా రంగాల్లో ఆయన కంపెనీలదే పైచేయి. ఇదంతా ఒకవైపు ఆయన ఎదుగుదలకు మరోపక్క ఉన్న స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

మోడీ ప్రధాని అయిన తర్వాతి నుంచి అదానీ ఎదుగుదల వేగం పుంజుకుందని చాలా మంది అంటుంటారు, ప్రతిపక్షాల నుంచి కూడా దీనిపై అదే మాట వినిపిస్తోంది. గడచిన 11 ఏళ్ల కాలంలో ప్రభుత్వ ఏజెన్సీలైన సీబీఐ, ఇన్కమ్ టాక్స్ లాంటి సంస్థలు దాటి చేసిన అనేక కంపెనీలు ఆ తర్వాతి కాలంలో అదానీ గ్రూప్ సంస్థలుగా మారిపోయాయి. అదానీ గుప్పిట్లోకి వాటిని తీసుకెళ్లటానికి ఇదంతా జరిగిందా అనిపించకమానది చూసేవారికి. ఒక్కసారి ఇది యాథృచికంగా జరిగిందా లేక కావాలనే రైడ్స్ చేసి వాటిని అదానీకి అమ్మేలా ఒత్తిళ్లు వచ్చాయా అనే విషయం పక్కనపెడితే ఏఏ సంస్థలు ఇలా చేతులు మారాయో గమనిద్దాం.. 

ముందుగా దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన మీడియా సంస్థల్లో ఒకటైన ఎండీటీవీ సీబీఐ రైడ్స్ తర్వాత అదానీ కొనుగోలు చేశారు. అంతర్గతంగా జరిగిన వాటాల కొనుగోళ్లలో అసలు వ్యవస్థాపకులను తప్పించారనే వాదనలు ఉన్నాయి. దీని తర్వాత జూన్ 2023లో ఆదాయపు పన్ను అధికారులు సిమెంట్ వ్యాపారంలోని సంఘీ ఇండస్ట్రీపై దాడులు చేపట్టగా ఆ తర్వాత ఆగస్టు 2023లో అదానీ గ్రూప్ దానిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

2020 డిసెంబరులో సిసిఐ అధికారులు అంబుజా ఏసీసీ సిమెంట్ మాతృసంస్థ హోల్సిమ్ ఇండియా కంపెనీపై దాడులు నిర్వహించగా.. 2022లో ఆ కంపెనీలను అదానీ సిమెంట్స్ చేజిక్కించుకుంది. ఇక ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని జీవీకే నిర్మించి నిర్వహిస్తుండగా ఈడీ రైడ్స్ తర్వాత దానిని అదానీ గ్రూప్ కొనుక్కుంది. ఇక ఆసియాలోనే అతిపెద్ద పోర్ట్ అయిన నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్మం పోర్టు ఆదాయపు పన్ను అధికారుల దాడుల తర్వాత అదానీ పోర్ట్స్ గా మారిపోయింది. చివరిగా ఐటీ అధికారులు మీడియా సంస్థ క్వింట్ పై సోదాలు చేశాక ఆ సంస్థ అదానీ గుప్పిట్లోకి రావాల్సి వచ్చింది.