ఈపీఎఫ్, SIP పెట్టుబడులతో రూ.10 కోట్లు కూడబెట్టొచ్చా..? ఎన్ని ఏళ్లు పడుతుంది..?

ఈపీఎఫ్, SIP పెట్టుబడులతో రూ.10 కోట్లు కూడబెట్టొచ్చా..? ఎన్ని ఏళ్లు పడుతుంది..?

ఒక వ్యక్తి తన రిటైర్మెంట్ అలాగే ఇద్దరు పిల్లల చదువు కోసం రూ.10 కోట్లు కూడబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందుకోసం ప్రతినెల మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ ద్వారా రూ.62వేలు ఇన్వెస్ట్ చేస్తుండగా.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో నెలకు రూ.34వేలు సేవ్ చేస్తున్నాడు. అయితే ఈ ప్లాన్ తనను 15 ఏళ్లలో రూ.10 కోట్లు కూడబెట్టేందుకు దోహదపడుతుందా అనే అయోమయంలో ఉన్నాడు. దీనికి తోడు కొద్దిగా ఈక్విటీ పెట్టుబడులు కూడా కలిగి ఉన్నట్లు చెప్పాడు.

అయితే దీనిపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సదరు వ్యక్తి ప్రస్తుతం పొదుపు చేస్తున్న ప్రణాళికను కొనసాగిస్తే రానున్న 15 ఏళ్ల తర్వాత రూ.6 కోట్ల వరకు కూడబెట్టవచ్చని మెవెల్త్ గ్రో.కామ్ సహ వ్యవస్థాపకులు హర్షద్ చేతన్వాలా అంచనా వేస్తున్నారు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై సగటు రాబడిని 12 శాతంగా పరిగణించగా.. ఈపీఎఫ్ పెట్టుబడులపై 7 శాతం రాబడిని లెక్కించటానికి తీసుకున్నారు. 

ALSO READ : మీరు వేసే పన్నులు, ఒప్పందాల్లో మా రైతులను వదిలేయండి : అమెరికాకు ఇండియా రిక్వెస్ట్

అయితే సదరు వ్యక్తి కోరుకున్న రూ.10 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవటానికి అదనంగా పెట్టుబడి మెుత్తాన్ని పెంచాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం దీర్ఘకాల్లో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను పెంచుతూ స్టెప్ అప్ చేయాలని అలాగే ప్రస్తుతం ఉన్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్కీమ్ తో పాటు లార్జ్ క్యాప్ లేదా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ తమ పెట్టుబడి పోర్ట్ ఫోలియోలో కొత్తగా చేర్చుకోవటం రిస్కును తగ్గిస్తుందని అంటున్నారు. మార్కెట్ల పనితీరు ఆందోళనలను పక్కన పెట్టి తమ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలను నిరంతరాయంగా కొనసాగించటంలోనే విజయం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.