
కోటీశ్వరుడిగా మారాలి కనీసం ఒక్క కోటైనా కూడబెట్టాలి అని ప్రతి మధ్యతరగతి భారతీయ కుటుంబం కోరిక. తమకు తల్లిదండ్రులు ఏ ఆస్తులు ఇవ్వలేదు కనీసం పిల్లలకైనా కొంత కూడబెట్టాలని అనుకుంటుంటారు. కానీ చాలా మందికి ఉన్న సమస్య పెద్ద ఆదాయం ఇచ్చే జాబ్ లేదా తల్లిదండ్రుల నుంచి ఆస్తులు రాకపోవటం మధ్యతరగతిలో కనిపిస్తుంటాయి. అలాంటి వారు కూడా సున్నా నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి కోటి రూపాయలకు చేరుకోవటం ఎలా అనే ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సంపదను కూడబెట్టడం ఒక ఆర్ట్ అంటుంటారు దాని గురించి తెలిసిన వ్యక్తులు. అయితే చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌషిక్ ఒక ప్రణాళికా ప్రకారం సామాన్యులు కూడా సంపన్నులుగా మారటం ఎలా అనే రోడ్ మ్యాప్ గురించి పంచుకున్నారు.
ముందుగా కోటి రూపాయల ప్రయాణంలో ఆర్థిక భద్రత కోసం సేవింగ్స్ ఖాతాలో ఒక లక్ష లేదా ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో ఉంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఇది అత్యవసర సమయంలో, ఉద్యోగం పోయినప్పుడు సహాయంగా నిలుస్తుందంటారు కౌషిక్. ఇక తర్వాత స్టార్ట్ చేయాల్సింది ప్రతి నెల రూ.10వేలు మ్యూచువల్ ఫండ్ సిప్ స్టార్ట్ చేయటం. దీనిని ఆపకుండా కొనసాగిస్తే 12 శాతం ఆదాయం సగటున 20 ఏళ్లలో కోటి రూపాయలు అవుతుందని చెప్పారు.
అంటే మధ్యతరగతి ప్రజలు తమకు పిల్లలు పుట్టడానికి ముందు స్టార్ట్ చేస్తే.. వారు పిల్లల్ని కని పెద్దవాళ్లయ్యే సమయానికి కోటి చేతిలో పడుతుందని చెబుతున్నారు కౌషిక్. ఒకవేళ ఆదాయం పెరిగినా లేదా ఫ్రీలాన్సింగ్ లాంటి పనులతో నెలకు రూ.30వేల వరకు ఆదాయం వస్తే దానిని కూడా పెట్టుబడులకే వాడాలని సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల 10 ఏళ్లలో అదనంగా మరో రూ.40 లక్షల వరకు కార్పస్ పోగవుతుందని చెప్పారు సీఏ.
ఈ ప్రయాణంలో ఖచ్చితంగా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా కలిగి ఉండాలని సూచించారు. ఇది అనవసరమైన ఈఎంఐల భారాన్ని అనారోగ్య సమయంలో తగ్గిస్తుందని సూచించారు సీఏ కౌషిక్. ఇక చివరిగా జీవితంలో ఫ్రీడం ఫండ్ ప్లానింగ్ చేసుకునే వ్యక్తులు తమ వార్షిక ఆదాయం ఎంత ఉంటే దానికి కనీసం 25 రెట్లు డబ్బు చివరికి అందేలా ప్లా్న్ చేసుకోవటం సేఫ్ అని చెబుతూ ఇందుకోసం మంచి సంపాదనను ఇచ్చే స్కిల్స్ నేర్చుకోవాల్సిందేనంటూ సూచించారు.