
Rule Changes From October 1 : అక్టోబర్ 1, 2025 నుంచి కొత్త నెల స్టార్ట్ అయ్యింది. దీంతో ప్రతి నెల మాదిరిగానే కొత్తగా అనేక అంశాలకు సంబంధించిన రూల్స్ కూడా అమలులోకి వస్తున్నాయి. యూపీఐ నుంచి పెన్షన్ వరకు వస్తున్న అనేక మార్పుల గురించి ప్రజలు తప్పకుండా తెలుసుకోవాలి. మార్పులు వ్యక్తులపై ఎలాంటి ఆర్థిక ప్రభావాన్ని, భారాన్ని చూపిస్తాయనే అంశాలను కూడా పరిశీలించటం ముఖ్యమే.
* మొదటగా UPI ద్వారా పీ2పీ రిక్వెస్ట్ ఫీచర్ నిలిపివేతతో మోసాలు తగ్గడంతో డబ్బు భద్రత పెరిగింది. ఇది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ను మరింత విశ్వసనీయంగా చేస్తుంది. మోసగాళ్లు గతంలో మాదిరిగా పేమెంట్ రిక్వెస్ట్స్ పంపటాన్ని దీంతో నిరోధించాలని ఎన్పీసీఐ నిర్ణయించింది.
* ఇక రెండోది రైల్వే టికెట్ బుకింగ్‌లో ఆధార్ ధృవీకరణకు సంబంధించిన నిబంధనల అమలు. కొత్తగా ఆధార్ తప్పనిసరిగా లింకింగ్ అమలుతో టికెట్ల బుక్కింగ్ మోసాలు, దుర్వినియోగాలు తగ్గనున్నాయి. ఇది ప్రయాణ సౌకర్యంతో పాటు న్యాయంగా ప్రజలకు టిక్కెట్లు అందుబాటులో ఉండేలా చేస్తుంది.
* కొత్త నెలలో పెన్షన్ స్కీమ్‌లలో వచ్చిన మార్పులతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపికలకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఇది వారి భవిష్యత్ ఆర్థిక భద్రతను మెరుగుపరచనుంది.
* ఇండియా పోస్ట్ సేవల్లో అందుబాటులోకి వచ్చిన OTP ఆధారిత డెలివరీ, రియల్‌టైమ్ ట్రాకింగ్, ఆన్‌లైన్ బుకింగ్స్ వినియోగదారులు వినియోగదారులకు కొత్త సౌలభ్యంగా మారనున్నాయి అక్టోబరులో.
* ఇక చివరిగా RBI కొత్త చెక్ క్లియరింగ్ విధానం, బ్యాంకింగ్ సేవల వేగవంతం వంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటంతో పాటు ప్రజలకు తక్కువ సమయంలోనే చెక్ పేమెంట్స్ క్లియర్ అవ్వటానికి దోహదపడుతుంది.