ఇది యాపారం : 5 సెకన్ల వాయిస్..రూ.5 కోట్ల రెమ్యునరేషన్

ఇది యాపారం : 5 సెకన్ల వాయిస్..రూ.5 కోట్ల రెమ్యునరేషన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)హవా మాములు రేంజ్లో లేదు. ఒకవైపు తన సినిమాలతో వరుస విజయాలు అందుకుంటూనే పలు ఇండియా టాప్ మోస్ట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా రాణిస్తున్నాడు.

మహేష్ బాబు కేవలం వెండితెరపైనే కాదు ఎండార్స్‌మెంట్స్‌లో కూడా స్టార్ స్టేటస్ ని పొందుతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు శీతల పానీయాల నుండి మొబైల్ ఫోన్‌ల వరకు యాడ్స్..ప్రమోషన్స్ చేస్తూ అదరగొట్టేస్తున్నాడు. ఇండియా వైడ్ గా పలు టాప్ మోస్ట్ బ్రాండ్‌లు మరియు కంపెనీలతో అనుబంధం కలిగి ఉన్నాడు.

లేటెస్ట్గా PhonePe ట్రాన్సక్షన్ యాప్ ప్రత్యేకమైన సెలబ్రిటీ వాయిస్ ఫీచర్‌ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబును సంప్రదించింది. PhonePe లావాదేవీలను తెలుగులో ప్రకటించడానికి మహేష్ వాయిస్ని ప్రత్యేకంగా ఎంచుకుంది. ఇందుకోసం స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది PhonePe.

ఈ వీడియోలో మహేష్..తన ఫోన్ లోంచి రూ.50లు ఫోన్ పే చేసి..'ఇపుడు రూ.50లు ఫోన్ పే ద్వారా వచ్చాయి. హ్యాట్సాఫ్ గురు గారు..ఇపుడు ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లో నా వాయిస్ వింటారు..అంటూ మాట్లాడారు. లెజెండరీ బిగ్ బి అమితాబ్ తర్వాత ఫోన్‌పేకి వాయిస్ ఇచ్చిన ఘనత మహేష్ బాబుకే దక్కింది.

అయితే, PhonePe కోసం తన వాయిస్‌ని ఇవ్వడానికి మహేష్ బాబు రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. కేవలం 5 సెకన్స్ల వాయిస్ కోసం PhonePe ఇంత మొత్తంలో చెల్లించిందంటే..ఇక అర్థమైంటుంది మహేష్ స్థాయి ఏంటనేది.ప్రస్తుతం మహేష్ వాయిస్తో ఉన్న ఈ PhonePe వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రీసెంట్‌‌గా ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. తన తర్వాతి రాజమౌళి సినిమా కోసం మహేష్ రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం.