
ITR Filing: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఐటీఆఫ్ దాఖలు సమయం దగ్గరపడింది. చివరి క్షణాల్లో చాలా మంది హడావిడి కారణంగా తప్పులు చేస్తుంటారు. అయితే కొత్త పన్ను చట్టాల ప్రకారం ఏదైనా సెక్షన్ల కింద డిడక్షన్స్ పొందాలంటే అదనపు సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని పన్ను శాఖ నోటిఫై చేసింది. ఈ క్రమంలో అసలు సరైన ఐటీఆర్ ఫారమ్ సెలెక్ట్ చేసుకోవటం నుంచి టాక్స్ ఫైలింగ్ ప్రక్రియను అర్థం చేసుకోవటం ముఖ్యం.
గతవారంలో ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ ఫైలింగ్ చివరి గడువు తేదీని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని టెక్నికల్ మార్పుల కారణంగా 45 రోజులు గడువు పొడిగింపును అందిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ క్రమంలో ఐటీఆర్-1 సహజ్, ఐటీఆర్-4 సుగమ్ కోసం యుటిలిటీస్ కూడా తెచ్చింది. దీనివల్ల తక్కువ తప్పులతో ఫారమ్‌ను ఆఫ్‌లైన్‌లో పూరించి అప్లోడ్ చేయవచ్చు. అయితే ఏ ఆదాయ వర్గాలకు చెందిన వ్యక్తులు ఏ ఐటీఆర్ ఫారమ్ సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే తప్పుడు ఐటీఆర్ ఫారమ్ పూరించటం వల్ల కొన్నిసార్లు పన్ను అధికారుల నుంచి నోటీసులు పొందే ప్రమాదం ఉంటుంది.
1. ఐటీఆర్-1 (సహజ్): వార్షిక ఆదాయం రూ.50 లక్షల కంటే తక్కువ నిర్థేశించబడింది. వారికి ఉండాల్సిన ఆదాయ వనరుల వివరాలు పరిశీలిస్తే..
- ఉద్యోగం లేదా పెన్షన్ ఆదాయం
- ఇల్లు అద్దె ఆదాయం
బ్యాంక్ FD/పొదుపు ఖాతా వడ్డీ
- వ్యవసాయ ఆదాయం (రూ.5000 వరకు)
2. ఐటీఆర్-2: ఐటీఆర్-1 దాఖలు చేయలేని వారి కోసం కానీ ఎటువంటి వ్యాపారం/వృత్తి లేని వారి కోసమే ఈ ఫారమ్.
- ఒకటి కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉన్న వ్యక్తులు
- షేర్లు/మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు
- విదేశాల నుండి ఆదాయం
3. ఐటీఆర్-3: ఈ ఫారమ్ పూర్తిగా వ్యాపారవేత్తల కోసం మాత్రమే నిర్థేశించబడింది
- దుకాణం నడుపుతూ ఉండటం, కన్సల్టెన్సీ లేదా ఫ్రీలాన్సింగ్ చేయండి.
- ఖాతాలను నిర్వహించాల్సిన వారు.
- ఆదాయం భాగస్వామ్య సంస్థ నుంచి పొందుతున్న వ్యక్తులు
4. ఐటీఆర్-4 (సుగమ్): ఈ ఫారమ్ చిన్న దుకాణదారులు/ప్రొఫెషనల్స్ కోసం తీసుకురాబడింది
- వార్షిక ఆదాయం రూ.50 లక్షల కంటే తక్కువ
- వ్యాపారం అంచనా పన్నుపై నడుస్తుంది
- వైద్యులు, ఇంజనీర్లు, ట్రక్కు యజమానులు లేదా చిన్న వ్యాపారవేత్తలు దీనిని దాఖలు చేయాల్సి ఉంటుంది.