మన రూపాయి కంటే.. ఆఫ్గనిస్తాన్ కరెన్సీ విలువ ఎక్కువ..! అవాక్కయ్యారా.. కానీ ఇది నిజం..!!

మన రూపాయి కంటే.. ఆఫ్గనిస్తాన్ కరెన్సీ విలువ ఎక్కువ..! అవాక్కయ్యారా.. కానీ ఇది నిజం..!!

Rupee Vs Afghani: షాకింగ్.. షాకింగ్.. షాకింగ్. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం భారత కరెన్సీ రూపాయి మారకపు విలువ పొరుగున ఉన్న ఆఫ్గనిస్తాన్ కంటే దిగజారి ఉండటంపై ఇంటర్నెట్ లో భారీ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. కొందరు దీనిని చూసి అసలు నిజమేనా అంటూ అవాక్ అవుతున్నారు. అసలు యుద్ధాలతో, రాజకీయ సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్గన్ కరెన్సీ విలువ మన రూపాయి కంటే ఎందుకు ఎక్కువగా ఉందనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు చాలా మంది. 

తాజాగా ఆఫ్గనిస్తాన్ కరెన్సీ అయిన ఆఫ్గానీ రేటు భారత్ అలాగే పాకిస్థాన్ కరెన్సీల కంటే బలంగా ఉంది. ప్రపంచంలో ఒక పేద, అనిశ్చితి కలిగిన దేశానికి ఇది ఎలా పాజిబుల్ అని అందిరికీ అనుమానం కలుగుతోంది. ఒక లక్ష ఆఫ్గానీ కరెన్సీ విలువ ప్రస్తుతం రూ.లక్షా 34వేల భారతీయ రూపాయలకు సమానంగా ఉంది. తాలీబన్ల పరిపాలనలో అభివృద్ధికి చాలా దూరంగా పేదరికం, మానవహక్కుల సంక్షోభం, పొరుగున ఉన్న పాకిస్థాన్ తో గొడవలతో సతమతం అవుతున్న ఆఫ్గన్ కరెన్సీ మాత్రం దూసుకుపోతోంది. 

అసలు రూపాయి కంటే ఆఫ్గానీ బలానికి కారణాలు.. 

అందరికీ ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ ఆఫ్గన్ కరెన్సీ బలానికి కారణం కరెన్సీ నిర్వహణపై ఆ దేశం పాటిస్తున్న కఠినమైన పాలసీలు అని తేలింది. 2021లో తాలీబన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఆ దేశం అమెరికా డాలర్లను, పాకిస్థాన్ రూపాయిని వాడటం బ్యాన్ చేసింది. దీంతో ఒక్కసారిగా విదేశీ కరెన్సీకి డిమాండ్ అక్కడ పడిపోయింది. ప్రస్తుతం ఆ దేశం దాదాపు అన్ని చెల్లింపులను ఆఫ్గానీ కరెన్సీలోనే చెపడుతోంది. 

పైగా దిగుమతులు తక్కువగా ఉండటం.. విదేశీ కరెన్సీల చెలామణిపై కఠినంగా తాలీబన్లు వ్యవహరించటం ఆ దేశ కరెన్సీని బలంగా మార్చేసింది. ఎక్కువగా దిగుమతులు, ఇతర దేశాలపై ఆధారపటం ఆగిపోవటంతో కరెన్సీ ఎక్కువ స్థిరంగా విలువను కలిగి ఉంటోంది. కరెన్సీ బలంగానే ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆఫ్గనిస్తాన్ దేశాన్ని పేదరికం, పారిశ్రామిక అభివృద్ధి వంటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆర్థిక వృద్ధి కూడా తక్కువగానే కొనసాగటం సమస్యగానే ఆ దేశానికి ఉంది. 

ఇక ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతున్న భారత్ గ్లోబల్ మార్కెట్లు, చెల్లింపులకు ఎక్కువ కనెక్ట్ అవ్వటం వల్ల రూపాయి విలువ ఆఫ్గన్ కరెన్సీ కంటే తక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంతో తక్కువగా సంబంధాలు కలిగి ఉండటమే ఆఫ్గానీ బలానికి బేస్ అని వారు అంటున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావాలు ఇండియన్ రూపాయిపై ఉన్నంత ఆఫ్గానీపై ఉండకపోవటం కూడా విలువ విషయంలో కీలకమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.