మూఢ నమ్మకాల కోసం ప్రజాధనం దుర్వినియోగం : కోదండరాం

మూఢ నమ్మకాల కోసం ప్రజాధనం దుర్వినియోగం : కోదండరాం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలనీ…. సొంత మూఢ నమ్మకాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

“పోయినగడీల పాలన మళ్లీ మాకు తేవొద్దని సీఎంను కోరుతున్నాం. ఈ నగరం పై హక్కు కేవలం సీఎంకే కాదు.. అందరికీ వుంది. ఒక్క సారి ఓట్లు వేస్తే ఐదేళ్లు రాష్ట్రం ఇచ్చినట్టు కాదు. జిల్లాల్లో ప్రజా అభిప్రాయం తీసుకుందాం. అవసరం అయితే ప్రత్యక్ష కార్యాచరణకు కూడా సిద్ధం అవుదాం. వదిలేది అయితే లేదు. వివేక్ వెంకటస్వామి ముందు వుండండి.. మేము మీతో వుంటాం. గవర్నర్ ను కలుద్దాం.. సెక్షన్ 8 కింద బిల్డింగ్ ల కూల్చివేతను ఆపాలని కోరుదాం” అని కోదండరామ్ పిలుపునిచ్చారు.