
కొడంగల్ పట్టణంలోని శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే పవిత్రోత్సవాలకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని దేవస్థానం తరఫున ఆహ్వానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 19 నుంచి 22 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ధర్మకర్తలు నందారం శ్రీనివాస్ గుప్తా, నందారం మధు, ఈవో రాజేందర్ పాల్గొన్నారు.