కొడిమ్యాల, వెలుగు : కొడిమ్యాల మండల కేంద్రంలోని బస్టాండ్ డంప్ యార్డును తలపిస్తోంది. బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లకపోవడంతో కొందరు బిచ్చగాళ్లు అడ్డాగా మార్చుకొని చెత్తకుప్పలా మార్చేశారు. మరోవైపు నిలవ నీడలేక రోడ్డుపైనే నిలబడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. కొద్ది రోజుల కింద ఆర్టీసీ చుట్టూ కాంపౌండ్ కూడా నిర్మించింది. కానీ బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకురాలేదు.
